: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మరో పదిమంది బయటకు రానున్నారు: టీడీపీ నేత ఆనం వివేకా


వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మరో పది మంది ఆ పార్టీ నుంచి బయటకు రానున్నారని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి అన్నారు. జగన్ కు ఒక పద్ధతి, విధానం లేకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగుండాలని అధికారపక్షం కోరుకుంటోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రశ్నే లేదని, తమ నాయకుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News