: మూడేళ్ల క్రితం కిడ్నాప్ నకు గురైన పాక్ మాజీ ప్రధాని కుమారుడిని రక్షించిన సంయుక్త దళాలు
మూడేళ్ల క్రితం కిడ్నాప్ నకు గురైన పాకిస్తాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రాజా గిలానీ చిన్న కుమారుడు అలీ హైదర్ గిలానీ సేఫ్ గా బయటపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్-అమెరికా సంయుక్త దళాలు అతన్ని రక్షించాయి. వైద్య పరీక్షల అనంతరం అలీ హైదర్ ని పాకిస్తాన్ కు పంపనున్నట్లు ఆఫ్ఘానిస్తాన్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిల్వాల్ భుట్టో ధ్రువీకరిస్తూ ఒక ప్రకటన చేశారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. అలీ హైదర్ కోసం ఇన్నేళ్లుగా నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైందన్నారు. కాగా, 2013 మే 9న జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న హైదర్ ను తాలిబాన్లు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీస్ ఆపరేషన్ నిర్వహించారు.