: ఏ సినిమా ఆఫర్ ఒప్పుకోవాలో తేల్చుకోలేకపోతున్నాను: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా
బాలీవుడ్ లో తనకు చాలా సినిమా ఆఫర్లు ఉన్నాయని..అయితే, ఏ సినిమాను ఒప్పుకోవాలనే విషయమై తేల్చుకోలేకపోతున్నానని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెప్పింది. తాను ‘హాలీవుడ్’ లో సెటిల్ అయిపోయానని, ఇంక బాలీవుడ్ చిత్రాల్లో నటించనంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. ఈ సందర్భంగా ప్రియాంకచోప్రా మాట్లాడుతూ, బాలీవుడ్ లో ఆఫర్లు బాగానే వస్తున్నాయని, అయితే, తనకు ఉన్న సమయం చాలా తక్కువ అని చెప్పింది. దీంతో, ఏ చిత్రాలను ఒప్పుకోవాలనే విషయం కొంచెం కష్టంగా ఉందని ప్రియాంక చోప్రా పేర్కొంది. అయితే, త్వరలోనే తన తదుపరి చిత్రం వివరాలను ప్రకటిస్తానని చెప్పింది.