: పల్టీలు కొట్టి డివైడర్ పై తిరగబడ్డ విజయసాయిరెడ్డి కారు!... గగుర్పాటుకు గురి చేసిన ప్రమాదం
వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కారు ప్రమాదానికి గురైన తీరు... ప్రమాద దృశ్యాలను చూసిన వారిని గగుర్పాటుకు గురిచేస్తోంది. హైదరాబాదు చుట్టూ ఏర్పాటైన ఓటర్ రింగ్ రోడ్డు మీదుగా నేటి ఉదయం శంషాబాదు ఎయిర్ పోర్టుకు వెళుతుండగా ఆయన కారు అదుపు తప్పింది. నాలుగు లేన్ల రహదారిపై వేగంగా దూసుకెళుతున్న సదరు కారు... అదుపు తప్పడంతో పల్టీలు కొట్టి రోడ్డుపై నుంచి లేచి డివైడర్ పై పడిపోయింది. ఈ పడటం కూడా నిలువుగా కాకుండా కారు ఓ పక్క భాగం కిందకు తిరిగబడిపోయింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం కాగా... కారు కూడా బాగానే దెబ్బతింది. కారు తిరగబడిన నేపథ్యంలో అందులోని విజయసాయ, ప్రసాదరాజు, దశరథ్ లు డ్రైవర్ సహా తిరగబడిపోయారు. అయితే ఇంతటి ప్రమాదంలోను విజయసాయి సహా మిగిలిన వారు కూడా స్వల్ప గాయాలతో బయటపడం గమనార్హం. పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమైన ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి.