: విస్మయం... స్నేక్ గ్యాంగ్ అత్యాచారాలు చేయలేదన్న కోర్టు, దోపిడీ, అసభ్య ప్రవర్తనే నేరమట!


హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రేమజంటలపై అత్యాచారాలు, దోపిడీలు చేశారని ఆరోపణలు వచ్చిన స్నేక్ గ్యాంగ్ కు కోర్టులో ఊరట లభించింది. బాధితులకు విస్మయాన్ని కలిగిస్తూ, వీరెవరూ అత్యాచారాలకు పాల్పడినట్టు ఆధారాలు లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వీరు లైంగిక దాడులు చేశారని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని న్యాయమూర్తి ప్రకటించారు. కేవలం దోపిడీ, అసభ్య ప్రవర్తన ఆరోపణలపైనే వీరు దోషులుగా తేలారని వెల్లడించారు. వీరికి శిక్షలను బుధవారం ఖరారు చేస్తామని న్యాయమూర్తి పేర్కొనగా, దాదాపు 37 జంటలపై దాడులకు దిగిన వీరిపై కనీసం ఒక్క అత్యాచార ఆరోపణనైనా పోలీసులు నిరూపించలేకపోయారని పలువురు కోర్టు ప్రాంగణంలోనే విమర్శించారు.

  • Loading...

More Telugu News