: నీట్ పై కేంద్రం మరో పిటిషన్... ఈసారి ప్రాంతీయ భాషల అంశం
దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశం పొందగోరే విద్యార్థులకు సంయుక్తంగా 'నీట్' నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కేంద్రం మరో పిటిషన్ దాఖలు చేసింది. పలు రాష్ట్రాల్లోని విద్యార్థులు మెడికల్ ప్రవేశాల కోసం స్థానిక భాషల్లో పరీక్షలను రాశారని గుర్తు చేస్తూ, కనీసం స్థానిక భాషల్లో నీట్ నిర్వహించుకునేందుకు అనుమతించాలని కోరింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో నెగటివ్ మార్కుల విధానం అమల్లో లేదని గుర్తు చేసింది. ఈ పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన కోర్టు, విచారించి విద్యార్థులకు మేలు కలిగించే నిర్ణయం వెలువరిస్తామని తెలిపింది.