: బీజేపీ టీమ్ వెంట రేఖా ఆర్యా... రావత్ కు అభయమిచ్చిన మాయావతి
ముందుగా ఊహించినట్టుగానే ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ నిర్వహించిన శిబిరానికి హాజరుకాని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్యా బీజేపీలోకి ఫిరాయించారు. ఈ ఉదయం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చిన వేళ, ఆమె బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి వచ్చారు. మరోవైపు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, హరీశ్ రావత్ కు అభయమిచ్చారు. తమ పార్టీ హరీశ్ కు మద్దతిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీతో తాను లోపాయకారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఈ ఉదయం వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. బలపరీక్షలో హరీశ్ కు అనుకూలంగా తమ సభ్యులు ఓటేస్తారని తెలిపారు. అసెంబ్లీలో బలపరీక్ష మరికాసేపట్లో జరుగనుంది.