: బీజేపీకి షాకిస్తూ, రావత్ కు మద్దతు ఇస్తున్నానన్న ఎమ్మెల్యే!
మరికాసేపట్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న హరీశ్ రావత్ మంత్రాంగం ఫలించినట్టే కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం రావత్, తన తరఫు ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టగా, విజయం సాధిస్తానన్న ధీమా కనిపించింది. కాంగ్రెస్ తో పాటు బీజేపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోగా, అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఓ బీజేపీ ఎమ్మెల్యే తాను హరీశ్ కు అనుకూలంగా ఓటేయనున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా తాము హరీశ్ వైపేనని స్పష్టం చేశారు. అసెంబ్లీలోకి వెళ్లేముందు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావత్, మరో రెండు గంటల్లో ముఖ్యమంత్రిగా బయటకు వస్తానని చెప్పడం గమనార్హం.