: కర్ణాటక ఎన్నికల్లో లోక్ సత్తా తరపున జేపీ ప్రచారం
కర్ణాటక విధానసభకు జరగనున్న ఎన్నికల్లో లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈ రోజు రెండో విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన బెంగళూరు నగరానికి చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు దక్షిణ బెంగళూరులోని హెచ్ ఆర్ లే అవుట్ నుంచి ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. బొమ్మనహళ్లి, అరికెరె మీదుగా హెబ్బల్ వరకు సుమారు 20 కిలో మీటర్ల మేర జరిగే ప్రచార పాదయాత్రలో జేపీ పాల్గొంటారు. అనంతరం హెబ్బల్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.