: శంషాబాదు ఎయిర్ పోర్టు పార్కింగ్ లో సూటు కేసు మాయం!
హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో చోరులు చేతివాటం ప్రదర్శించారు. ఎయిర్ పోర్టు పార్కింగ్ లో నిలిపి ఉంచిన ఓ కారులోని సూటు కేసు మాయమైన ఘటన నేటి ఉదయం అక్కడ కలకలం రేపింది. నగదుతో పాటు బంగారు ఆభరణాలు, పలు కీలక పేపర్లు ఉన్న సదరు సూటు కేసును ఓ వ్యక్తి కారులోనే ఉంచి ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లాడు. ఎయిర్ పోర్టు నుంచి తిరిగి బయటకు వచ్చిన అతడు తన కారులో సూటు కేసు కనిపించకపోవడంతో షాక్ తిన్నాడు. వెనువెంటనే అతడు అక్కడే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.