: భాగ్యనగరిని ముంచెత్తిన వాన!... పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు
భాగ్యనగరి హైదరాబాదును వరుణ దేవుడు ముంచెత్తాడు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత మొదలైన వర్షం నేడు తెల్లవారిన తర్వాత కూడా కురుస్తూనే ఉంది. దాదాపుగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. నిన్నటిదాకా భానుడి ప్రతాపంతో బయటకు వచ్చేందుకు జడిసిన జనం... తాజాగా వరుణ దేవుడి ప్రతాపంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే... నాలుగైదు రోజులుగా కురుస్తున్న చిరు జల్లుల కారణంగా నగరం చల్లబడింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గాయి.