: సీనియర్ ఐపీఎస్ ఇంటిలో ఐదడుగుల జెర్రిపోతు!... బెంబేలెత్తిన కుటుంబ సభ్యులు


ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సుదీప్ లాక్డాకియా ఇంటిలో నిన్న రాత్రి పాము కలకలం చోటుచేసుకుంది. ఐదడుగుల పొడవున్న జెర్రిపోతు ఒకటి ఆయన ఇంటిలోకి చొరబడింది. అంత పొడవు పామును చూసిన పోలీసాఫీసరు కుటుంబం బెంబేలెత్తింది. హైదరాబాదులోని లక్డికాపూల్ లోని లాక్డాకియా ఇంటిలోకి పాము దూరిందన్న వార్త తెలుసుకున్న వెంటనే చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్ నాయక్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పాము కోసం ఇల్లంతా జల్లెడ పట్టిన అతడు ఆ పామును పట్టేశాడు. దీంతో లాక్డాకియా కుటుంబం ఊపిరి పీల్చుకుంది. లక్డికాపూల్ లోని మరో పోలీసాఫీసర్ ఇంటిలో గతంలోనూ ఓ పాము చొరబడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News