: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని అపాయింట్ మెంట్!... మధ్యాహ్నం 12 గంటలకు భేటీ


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎట్టకేలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ లభించింది. నిన్న రాత్రి హస్తిన పర్యటనకు వెళ్లిన కేసీఆర్ నేటి మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం నుంచి కేసీఆర్ కు అపాయింట్ మెంట్ లభించింది. తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రధానికి వివరించనున్న కేసీఆర్... ఆర్థిక సహాయం చేయాలని కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ప్రధానితో భేటీకి యత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. తాజా పర్యటనలో ఆయనకు మోదీ అపాయింట్ మెంట్ లభించింది. ప్రధానితో భేటీ తర్వాత కేసీఆర్... ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News