: మే 15న తెలంగాణ ఎంసెట్...కేవలం ఇంజనీరింగ్ కోసమే!
మే 15న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్ పరీక్షను కేవలం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసమే నిర్వహించనున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎంసెట్ పరీక్ష నుంచి మెడికల్ పరీక్షలను మినహాయించామని అధికారులు తెలిపారు. అగ్రికల్చరల్, వెటర్నరీ అడ్మిషన్లపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో 15 తేదీన ఎంసెట్ పరీక్షకు కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే హాజరుకావాలని, మెడిసిన్ పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపింది.