: మరాఠి హీరోయిన్ వెబ్ సైట్ లో మంత్రి ఫోన్ నంబర్!


మరాఠి హీరోయిన్ రింకూ రాజ్ గురు వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన వ్యక్తులు... ఆ వెబ్ సైట్ లో మహారాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్ ఫోన్ నంబర్ ను ఉంచారు. దీంతో, రింకూ రాజ్ గురు అభిమానుల నుంచి లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ ఆయనకు వెళ్లడంతో, మంత్రి గారికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. చివరకు, ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. ఈ సంఘటనపై సదరు మంత్రి మాట్లాడుతూ, రింకూ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన వాళ్లు తన ఫోన్ నంబర్ ను అందులో ఉంచి తమ తెలివితేటలను ప్రదర్శించారని, ఈ సంఘటనలో రింకూ ప్రమేయమేమి లేదని అన్నారు. ఫోన్ కాల్స్ వెల్లువలా వస్తుండటంతో కొద్దిసేపు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశానని, ఆ తర్వాత చూస్తే చాలా మిస్డ్ కాల్స్ తో పాటు మెస్సేజ్ లు కూడా ఉన్నాయని చెప్పారు. కాగా, మరాఠీ చిత్రం ‘సాయిరత్’లో ఆమె నటనకు గాను ప్రశంసలు పొందింది. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను నెలకొల్పింది.

  • Loading...

More Telugu News