: పదిరోజుల్లోపే ‘బాహుబలి’ని దాటేసిన ‘కబాలి’... యూ ట్యూబ్ లో దుమ్మురేపుతున్న టీజర్!
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ట్రైలర్ హిట్స్ ను తమిళ సూపర్ స్టార్ నటించిన ‘కబాలి’ చిత్రం అధిగమించింది. దీంతో ఈ చిత్రం విడుదల కాకముందే రికార్డు సృష్టించింది. వివరాల్లోకి వెళితే... 2015 జూన్ 1న యూట్యూబ్ లో ‘బాహుబలి’ తెలుగు ట్రైలర్ ను ఉంచారు. ఇప్పటి వరకు ఈ చిత్రం ట్రైలర్ ను మొత్తం 1.30 కోట్ల మందికి పైగా వీక్షించారు. కానీ, ‘కబాలి’ టీజర్ విడుదలై పది రోజులు కాకముందే 1.58 కోట్ల మందికి పైగా చూశారు. గత నెల 30వ తేదీన కబాలి టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. కాగా, పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే నటిస్తోంది.