: పాలుపోని తెలంగాణ సర్కారు...ఎంసెట్ నిర్వహణపై మల్లగుల్లాలు


సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ నెల 15న ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్న దశలో సర్వోన్నత న్యాయస్థానం... వైద్య విద్యనభ్యసించాలంటే నీట్ పరీక్ష రాయక తప్పదని స్పష్టం చేసింది. నీట్ నిబంధనల ప్రకారం రాష్ట్రాల చట్టాలు చెల్లవని, ఎంబీబీఎస్, బీడీఎస్ కు మాత్రమే నీట్ వర్తిస్తుందని, నీట్ నిర్వహణ ద్వారా రాష్ట్రాల, మైనారిటీ కాలేజీల హక్కులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసెట్ పరీక్ష నిర్వహణ అసాధ్యంగా మారింది. జూలై 24న రెండో విడత నీట్ ఉన్నందున విద్యార్థులు దానికి సన్నద్ధమవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఎంసెట్ నిర్వహణ టెక్నికల్ గా ఉపయోగం లేదు. సుప్రీం తీర్పుపై నిపుణులతో చర్చిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణపై రేపు ప్రకటన విడుదల చేయనుంది.

  • Loading...

More Telugu News