: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అభ్యంతరం లేదు, కానీ, మా ప్రయోజనాలు దెబ్బతినకూడదు!: మంత్రి హరీష్ రావు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా దెబ్బతినకూడదని, తెలంగాణకు న్యాయం చేయాలని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. ఇండస్ట్రియల్ ఇన్ సెంటివ్ ను ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణాకు కూడా ఇస్తామన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కోటి ఎకరాలు సాగులోకి వస్తే ఆకుపచ్చ తెలంగాణ కల నెరవేరుతుందన్నారు. మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను బలోపేతం చేశామని, ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే ఊరుకోమని, మిడ్ మానేరు ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News