: ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయడమే లక్ష్యం: బొజ్జల
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేకుండా చేయడమే టీడీపీ లక్ష్యమని ఆ పార్టీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుంటే భవిష్యత్ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు ఆకర్షితులై విపక్ష నేతలు తమ పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. టీడీపీలో చేరిన వారికి డబ్బు, పదవులు ఆశ చూపించలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరుతామని వచ్చే ప్రతి ఒక్కరినీ తాము ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా కోసం టీడీపీ ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. హోదా వస్తే తమకే మంచిదని ఆయన తెలిపారు.