: పార్కింగ్ లో కారు తగిలిందని షాపులో దూరి అన్నదమ్ములపై దాడి


తన కారును ఓవర్ టేక్ చేశాడని ఎమ్మెల్సీ కుమారుడు బీహార్ లో ఓ యువకుడిని తుపాకీతో కాల్చి చంపాడన్న విషయం నిన్న సంచలనం రేపింది. ఈలోగా చిన్న కారణానికి ఇద్దరు అన్నదమ్ములను దుండగులు నరికిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని లూధియానాలో గురుప్రీత్ సింగ్ అనే వ్యాపారి కారును పార్కింగ్ లాట్ లో పార్కింగ్ చేస్తుండగా, మరో కారును తాకింది. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత గురుప్రీత్ సింగ్ షాపులోకి వెళ్లగా, ఆయన షాపులోకి చొరబడిన దుండగులు కత్తులతో నరికారు. ఈ ఘటనలో గురుప్రీత్ తో పాటు ఆయన సోదరుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు కత్తులతో స్వైరవిహారం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య గురుప్రీత్ సోదరులు కొట్టుమిట్టాడుతుండగా, కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితులకోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News