: ప్రధాని సర్టిఫికేట్లు ముమ్మాటికీ నకిలీవే...అఫిడవిట్ బయటపెట్టండి: ఆప్
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ, గుజరాత్ యూనివర్సిటీల్లో డిగ్రీ, ఎంఏ చేశారని చెబుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సర్టిఫికేట్లను మీడియాకు చూపించిన కాసేపటికే ఆమ్ ఆద్మీ పార్టీ విరుచుకుపడింది. అవి ముమ్మాటికీ నకిలీ సర్టిఫికేట్లేనని పేర్కొంది. బీఏ, ఎంఏ సర్టిఫికేట్లలో ప్రధాని పేరు వేర్వేరుగా ఉందని ఆప్ నేత అశుతోష్ తెలిపారు. ప్రధాని బీఏ మార్క్స్ షీట్ లో గ్రాడ్యుయేషన్ చేసిన సంవత్సరానికి, డిగ్రీ సర్టిఫికేట్ లో ఉన్న సంవత్సరానికి తేడా ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ తన పేరు మార్చుకున్నట్టైతే, అందుకు సంబంధించిన అఫిడవిట్ ను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.