: తిరుపతి లడ్డూలో నల్ల కాళ్ల జెర్రి ప్రత్యక్షం!
తిరుపతి లడ్డూలో జీడిపప్పులు, కిస్ మిస్, పటికబెల్లం కామన్ గా వుంటాయి. అయితే, అప్పుడప్పుడు ఈ లడ్డూలో ఇనుపముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు... కనిపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా, తిరుమల లడ్డూలో చనిపోయిన నల్ల కాళ్ల జెర్రి దర్శనమిచ్చింది. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన గొన్నాబత్తుల దేవీప్రసాద్, త్రినాథ్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెళ్లిన వీరు నాలుగు లడ్డూలు తీసుకున్నారు. తిరిగి ఆదివారం తమ గ్రామానికి చేరుకున్నారు. అందులో ఒక లడ్డూను తినేందుకని ఓ ముక్క తీసుకోగా, అందులో చనిపోయిన నల్ల కాళ్ల జెర్రి కనిపించడంతో భక్తులు షాక్ తిన్నారు. ఈ సంఘటనపై తాము విస్మయం చెందామని, భక్తులు పవిత్రంగా భావించే ప్రసాదంలో ఇటువంటివి ఉండటం సబబు కాదని వారు మండిపడ్డారు.