: ఇష్టమైన ఆహారం తీసుకోవడం కూడా సక్సెస్ రహస్యమే: సినీ నటి త్రిష


నాజూకుగా ఉండటం కోసం రోజువారీ తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవడం, డైటింగ్ చేయడం, కేవలం పళ్ల రసాలతోనో లేక నిపుణుల సూచనలను అనుసరించడమో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సినీ హీరోయిన్ల విషయానికొస్తే, వారు తీసుకునే ఆహారం విషయంలో ఆచితూచి మరీ వ్యవహరిస్తుంటారు. అయితే, ఇవేవీ తనకు పట్టవంటోంది దక్షిణాది వెండితెర నాజూకు భామ త్రిష. ఇష్టమైన ఆహారం తీసుకోవడం కూడా తన సక్సెస్ రహస్యమేనంటూ ఈమేరకు త్రిష ఒక ట్వీట్ చేసింది. రకరకాల ఆహార పదార్థాలతో కూడిన కొలాజ్ ను ఆమె పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News