: గంటలో ఎంసెట్ రిజల్ట్స్...సుప్రీం తీర్పుకోసం ఎదురు చూస్తున్నాం: కామినేని
గంటలో ఎంసెట్ రిజల్ట్స్ విడుదల చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రిజల్ట్స్ విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, రిజల్ట్స్ చేతిలోనే ఉన్నాయని ఆయన అన్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును చదివిన తరువాత ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ఫలితాలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు. మెడికల్ అండ్ అగ్రికల్చరల్ ఫలితాల వల్లే సందిగ్ధత నెలకొందని అన్నారు. నీట్ పై తీర్పు పైనే ఎంసెట్ ఫలితాల వెల్లడి ఆధారపడుతుందని అన్నారు. నీట్ ను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం తీర్పునిస్తే మెడికల్ ఫలితాలు వాయిదా వేయాలని భావించాలని అన్నారు. నీట్ తీర్పు నెట్ లో సుప్రీం కోర్టు అప్ లోడ్ చేస్తుందని, అది అప్ లోడ్ అయిన తరువాత ఫలితాలు వెల్లడిచేస్తామని ఆయన తెలిపారు.