: నితీష్ కుమార్ పగటి కలలు కంటున్నారు: ఆర్జేడీ ఎంపీ


బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని ఆర్జేడీ ఎంపీ మహ్మద్ తస్లీముద్దీన్ ఎద్దేవా చేశారు. కిషన్ గంజ్ లో ఆయన మాట్లాడుతూ, నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిత్వానికి అనర్హుడని అన్నారు. సొంత రాష్ట్రంలో సుపరిపాలన అందించలేని మంత్రి దేశానికి సుపరిపాలన ఎలా అందిస్తాడని ఆయన ప్రశ్నించారు. బీహార్ లో మద్యపాన నిషేధం విధించిన నితీష్ కుమార్ ఆ విషయాన్ని దేశం మొత్తం ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీహార్ లో హత్యలు పెరిగిపోయాయని, పాలన కుప్పకూలిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ విభాగాలపై పాలకులు పట్టు కోల్పోయారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News