: ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని టీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది: జానారెడ్డి


రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ, హామీలు నెరవేరుస్తామని కాలం గడుపుతోందని ఆయన విమర్శించారు. పాలేరు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News