: ఏప్రిల్ లో కార్ల అమ్మకాల వృద్ధి 1.87 శాతమే!


ఇండియాలో కార్ల అమ్మకాలు గడచిన ఏప్రిల్ నెలలో 1.87 శాతం పెరిగాయని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించింది. దేశవాళీ పాసింజర్ కార్ల అమ్మకాలు 2015 ఏప్రిల్ తో పోలిస్తే 1,59,588 యూనిట్ల నుంచి 1,62,566 యూనిట్లకు పెరిగాయని పేర్కొంది. ఇదే సమయంలో మోటార్ సైకిళ్ల అమ్మకాలు మాత్రం 16.24 శాతం పెరిగి 8.81 లక్షల యూనిట్ల నుంచి 10.24 యూనిట్లకు పెరిగాయని పేర్కొంది. స్కూటర్లు తదితరాలను కలిపి మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలను పరిశీలిస్తే 21.23 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. వాణిజ్య పరమైన వాహనాల విక్రయాలు 17.36 శాతం పెరిగి 53,835 యూనిట్లకు చేరాయని సియామ్ ఒక ప్రకటనలో తెలియజేసింది.

  • Loading...

More Telugu News