: తెలంగాణలో రాగల 48 గంట్లో వడగళ్ల వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావారణ శాఖాధికారులు తెలిపారు. ఈ మేరకు హైదరాబాదు వాతావరణ కేంద్రం ఒక ప్రకటన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో మధ్యాహ్నం వరకు ఎండగా ఉండటం, ఆపై మబ్బులు కమ్ముకోవడం, చల్లబడటం, ఒక మోస్తరు లేదా భారీగానో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.