: గొడ్డు చాకిరీ... సున్నం కలిపిన అన్నం: తెలంగాణలోని మైక్రోమ్యాక్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల ఆందోళన


దాదాపు నెల రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరం మండలం తుక్కుగూడలో ప్రారంభమైన మైక్రోమ్యాక్స్ మొబైల్ తయారీ కేంద్రంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు ఆఫర్ లెటర్లలో ఇచ్చిన విధంగా చెల్లించడం లేదని, తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. భోజనంలో సున్నం కలుపుతున్నారని విమర్శించిన ఉద్యోగులు, యాజమాన్యం బలవంత పెట్టి మరీ, రోజుకు 10 గంటలు పనిచేయించుకుంటోందని, వచ్చి పోయేటప్పుడు తనిఖీల పేరిట వేధిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాంటులో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ప్లాంటును తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News