: రాహుల్ గాంధీని హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ ... విచారణ షురూ


"అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఖండఖండాలుగా నరికేస్తాం" అంటూ పుదుచ్చేరిలో నివాసముంటున్న కేంద్ర మాజీ మంత్రి వీ నారాయణస్వామి నివాసానికి వచ్చిన లేఖలో గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. రేపు ఆయన పుదుచ్చేరిలో భాగమైన కారైకల్ లో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఈ లేఖ రావడం గమనార్హం. ఎవరి సంతకమూ లేని ఈ లేఖలో "కాంగ్రెస్ పార్టీ విధానాల కారణంగా కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్రంలో కష్టాలు నెలకొనడానికి కాంగ్రెస్ నేతలే కారణం. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని ముక్కలు ముక్కలు చేస్తాం" అని లేఖలో ఉంది. దీనిపై నారాయణస్వామి, ఇతర కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ ప్రారంభమైంది. ఈ లేఖను పుదుచ్చేరి నుంచే పోస్ట్ చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News