: 'లోఫర్' భామని సర్ ప్రైజ్ లో ముంచెత్తిన జాకీచాన్


'లోఫర్' సినిమాలో వరుణ్ తేజ్ కి జతగా నటించిన దిశా పటానీని ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీ చాన్ ఓ సర్ ప్రైజ్ తో ఆనందంలో ముంచెత్తాడు. జాకీ చాన్ తో కలిసి 'కుంగ్ ఫూ' యోగా సినిమాలో నటిస్తున్న ఈ చిన్నది చాలా కాలంగా హాంగ్ కాంగ్ లోనే ఉంటోంది. దాంతో షూటింగ్ తో అలసిపోయిన దిశా పటానీ ముంబైలో ఇంటికి వచ్చి వెళ్లాలని భావించింది. బ్యాగేజీ సర్దుకుని యూనిట్ ఏర్పాటు చేసిన విమానం టికెట్లు చూసి ఆశ్చర్యపోయింది. ముంబై వెళ్లాల్సిన దిశాకు డిస్నీల్యాండ్ టికెట్లు కనిపించాయి. దీంతో గతంలో తాను జాకీకి డిస్నీల్యాండ్ ను చూడాలనుకుంటున్నట్టు తెలిపిన సంగతి గుర్తుకువచ్చింది. అంతేకాదు, చిత్ర యూనిట్ తో కలిసి జాకీ కూడా ఆమెతో డిస్నీల్యాండ్ కు వెళ్లి ఒకరోజంతా దగ్గరుండి చూపించి ముంబై పంపాడని సమాచారం. ఈ సర్ ప్రైజ్ తో దిశా పటాని ఫుల్ ఖుషీ అయిపోయిందని సమాచారం.

  • Loading...

More Telugu News