: నన్ను కొనే దమ్ము ఎవరికీ లేదు: ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
తెలుగుదేశం పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగంగానే, తాను కూడా వైకాపాను వీడుతున్నానన్న ప్రచారం చేస్తున్నారని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఇక్కడ జరిగిన జల దీక్షలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, తనను కొనే దమ్ము, ధైర్యం ఏ తెలుగుదేశం నేతకూ లేవని నిప్పులు చెరిగారు. ఆ ధైర్యం ఎవరికైనా ఉంటే ముందుకు రావాలని సవాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని అడ్డుకుంటామని తెలిపారు. పార్టీ మారాల్సిన అవకాశం, అవసరం తనకు లేవని స్పష్టం చేస్తూ, వైఎస్ జగన్ తోనే తాను కలకాలం నడుస్తానని విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.