: ఊరికే అణ్వాయుధాలు ప్రయోగించను...సార్వభౌమాధికారానికి ఆటంకం కలిగిస్తే మాత్రం ఊరుకోను: ఉత్తర కొరియా అధ్యక్షుడు
తమ జోలికి రానంతవరకూ తాము ఎవరి పైనా అణ్వాయుధాలు ప్రయోగించమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. పార్టీ ఆఫ్ కొరియా ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంత ఈజీగా తమ దేశం అణ్వాయుధాలు ప్రయోగించదని అన్నారు. ఎవరైనా దండెత్తి వచ్చి తమ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే తప్ప అణ్వాయుధాలను బయటకి తీయమని అన్నారు. కాగా, ఎంతో విశ్వసనీయతతో ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. అణ్వాయుధ రహిత ప్రపంచం అవతరించేందుకు తమ ప్రయత్నం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచంలోని తమ శత్రుదేశాలపై కూడా తమకు గౌరవముందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.