: నకిలీ, ఫోర్జరీ సర్టిఫికెట్లవి: మోదీ డిగ్రీలపై ఆప్
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల సర్టిఫికెట్లను అమిత్ షా, అరుణ్ జైట్లీలు మీడియా ముందు ప్రవేశపెట్టిన గంట తరువాత, ఆప్ నేతలు అవి నకిలీవని, ఫోర్జరీతో సృష్టించినవని విమర్శలు గుప్పించారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదో డిగ్రీని చూపించి, అదే నిజమని అమిత్ షా చెబితే నమ్మడానికి, ఆయనేమీ దేవుడు కాదని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ విద్యార్హతలుగా చెబుతున్న రెండు కాపీలను చూపించిన అశుతోష్, అమిత్ షా చూపించిన వాటికి, తన వద్ద ఉన్న వాటికీ తేడా ఉందని అన్నారు. అమిత్, జైట్లీలు ఏదో చేయాలని భావించి అడ్డంగా దొరికిపోయారని, డిగ్రీలో ఆయన తన పేరును ఎలా మార్చుకున్నారో అఫిడవిట్ కాపీతో సహా చూపించాలని డిమాండ్ చేశారు.