: కురువృద్ధుడు అద్వానీనే పక్కనపెట్టిన బీజేపీ ఏపీనీ పట్టించుకుంటుందా?: హీరో శివాజీ
ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకే అధికారం కట్టబెట్టిన కురువృద్ధుడు అద్వానీనే పక్కన పెట్టిన ఆ పార్టీ ఏపీని పట్టించుకుంటుందా? అని ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ హీరో శివాజీ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చేస్తున్న రెండో రోజూ దీక్షకు శివాజీ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని బీజేపీనీ నమ్మవద్దని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నైనా సరే, ప్రత్యేక హోదా సాధించుకుని తీరతామని, కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందేనని శివాజీ అన్నారు.