: కనీస మానవత్వం చూపించరా?: బాబు సర్కారుపై జగన్ నిప్పులు


రైతులపై చంద్రబాబు సర్కారు కనీస మానవత్వాన్ని సైతం చూపించడం లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో తప్పుడు విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపిస్తూ, దాన్ని వెంటనే సరిచేసుకుని, అరటి, బొప్పాయి రైతులను ఆదుకునేందుకు రూ. 50 వేల సబ్సిడీని ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని నల్లపురెడ్డి పల్లెలో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన జగన్, రైతు సమస్యల పరిష్కారానికి తాను ఉద్యమిస్తానని తెలిపారు. 2014-15 సంవత్సరంలో అధికారులు రూ. 1,500 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని లెక్కకడితే, చంద్రబాబు క్యాబినెట్ దాన్ని తొలుత రూ. 1000 కోట్లకు, ఆపై రూ. 692 కోట్లకు తగ్గించిందని, దాన్ని కూడా పూర్తిగా విడుదల చేయలేదని విమర్శించారు. తక్షణం నిధుల విడుదల రైతులకు సబ్సిడీ ఇచ్చేలా డిమాండ్ చేస్తూ, అధికారులకు, చంద్రబాబుకు లేఖను రాయనున్నట్టు తెలిపారు. పంటల బీమా కోసం మండలాన్ని ఒక యూనిట్ గా పరిగణించకుండా, గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.

  • Loading...

More Telugu News