: ఆగని ‘అగస్టా’ ప్రకంపనలు!... రాజ్యసభలో జైరాం, సుబ్రహ్మణ్యస్వామిల వాగ్వాదం
వీవీఐపీల కోసం భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్లకు సంబంధించి జరిగిన కుంభకోణంపై రాజ్యసభలో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటి ఉదయం ప్రారంభమైన ఉభయసభల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, బీజేపీ నేత, ఈ కుంభకోణాన్ని వెలికితీసిన సుబ్రహ్మణ్యస్వామిల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం మానేసిన నరేంద్ర మోదీ సర్కారు... కాంగ్రెస్, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిష్ఠను మంటగలిపేందుకు యత్నిస్తోంది అంటూ జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ఇందుకు ప్రతిగా ఘాటుగానే స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి... తామేమీ ఊరికే వాదించడం లేదని, తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని చెప్పారు. ఇరువురు నేతల వాద ప్రతివాదనలతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.