: కరీంనగర్ లో రాళ్లు చేతబట్టి సైకో వీరంగం
తెలంగాణలోని కరీంనగర్ పట్టణంలో కొద్దిసేపటి క్రితం ఓ సైకో వీరంగమాడాడు. నగరంలోని వీధుల్లో నేటి ఉదయం రాళ్లు చేతబట్టుకుని రంగప్రవేశం చేసిన సైకో... తనకు కనిపించిన వ్యక్తులు, వాహనాలపై దాడికి దిగాడు. ఈ దాడిలో 8 వాహనాలు దెబ్బతినగా పలువురు వ్యక్తులకు గాయాలయ్యాయి. సదరు సైకో ఎందుకు దాడి చేస్తున్నాడో తెలియక జనం పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.