: ‘అనంత’లో హైటెన్షన్!... ‘హోదా’ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఎదురొడ్డిన వామపక్షాలు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రిలే దీక్షలు ప్రారంభమైన అనంతపురం నగరంలో నేటి ఉదయం హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఓ పక్క ప్రత్యేక హోదా సాధన సమితి రిలే దీక్షలు చేస్తుండగా, వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ఈ దీక్షలకు మద్దతు పలికాయి. వైసీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, గురునాథ్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలు కూడా ఈ దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో దీక్షాస్థలికి పెద్ద ర్యాలీగా బయలుదేరిన వామపక్షాలు, విద్యార్థి సంఘాలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుకు కదలనిచ్చేది లేదని పోలీసులు తేల్చిచెప్పగా, అడ్డగింతను సహించేది లేదని వామపక్ష కార్యకర్తలు బారికేడ్లను ఎక్కేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.