: అరెరె... ఏపీకి ఇంత అన్యాయం జరుగుతోందా?... అంబేద్కర్ యాసలో శివప్రసాద్ విస్మయం


ఏపీకి ప్రత్యేక హోదా కోసం వినూత్న నిరసనల్లో భాగంగా అంబేద్కర్ వేషం వేసిన టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ యాసలోనూ రాజ్యంగ నిర్మాతనే అనుకరించారు. నేటి ఉదయం అంబేద్కర్ వేషధారణలో పార్లమెంటుకు వచ్చిన శివప్రసాద్ మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్ స్టైల్లో ‘‘అరెరె... ఏపీకి ఇంత అన్యాయం జరుగుతోందా? నేను రాసిన రాజ్యాంగానికే విలువ లేదా? ఏపీ అభివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న చంద్రబాబుకు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయా? విభజన సందర్భంగా ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ప్రకటించలేదా? నాడే ఐదేళ్లు కాదు, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు కోరలేదా?’’ అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News