: పవర్ ఫుల్ చమురు మంత్రిని తొలగించిన సౌదీ రాజు!


సౌదీ అరేబియాకు సుదీర్ఘకాలంగా చమురు శాఖ మంత్రిగా సేవలందిస్తున్న అలీ అన్-నైమీని పదవి నుంచి తొలగిస్తున్నట్టు సౌదీ రాజు సల్మాన్ ప్రకటించారు. ముడిచమురు ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న సౌదీ, ఇటీవలి కాలంలో ఇంధనాదాయ కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అట్టడుగుకు పడిపోయిన క్రూడాయిల్ ధరలు సౌదీ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయగా, భవిష్యత్తులో చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సౌదీ రాజు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే నైమీకి ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది. నైమీ స్థానంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం 'సౌదీ అర్మాకో' చీఫ్ ఖలీద్ అల్-ఫలిహ్ చమురు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

  • Loading...

More Telugu News