: మాల్యా లేకుండా శిక్షేంటి?... జీఎంఆర్ కేసులో న్యాయమూర్తి వ్యాఖ్య


గతంలో జీఎంఆర్ గ్రూపునకు విజయ్ మాల్యా ఇచ్చిన చెక్కు బౌన్సయిన కేసులో వాదనలు పూర్తయినప్పటికీ, శిక్షను విధించలేమని న్యాయమూర్తి వెల్లడించారు. నిందితుడు కోర్టుకు హాజరు కాకుండా శిక్షను ఖరారు చేయడం కుదరదని తెలిపిన హైదరాబాద్, ఎర్రమంజిల్ కోర్టు.. కేసు విచారణను 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. విజయ్ మాల్యాపై చెక్ బౌన్సు కేసును జీఎంఆర్ గ్రూప్ దాఖలు చేయగా, పలుమార్లు కోర్టు విచారణకు గైర్హాజరైన మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News