: మనవడు దేవాన్ష్ తో కలసి విమానమెక్కిన చంద్రబాబు!


నిత్యమూ పరిపాలన, రాజధాని నిర్మాణ పర్యవేక్షణ, మంత్రులు, ఉద్యోగులతో సమీక్షలతో బిజీగా గడిపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కాస్తంత సేదదీరేందుకు ఆరు రోజుల విదేశీ పర్యటనకు కుటుంబ సభ్యులతో కలిసి పయనమయ్యారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ లు చంద్రబాబు వెంట వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా థాయ్ ల్యాండ్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఆయన గడపనున్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా మనవడితో గడిపేందుకే ఆయన ఈ పర్యటనకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తాను విదేశాల్లో ఉన్న సమయంలో మంత్రులంతా విజయవాడలోనే ఉండి పరిపాలనకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News