: పీఏసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వైసీపీ యువనేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి!
ఏపీ ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ గా వైసీపీ యువ నేత, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. మొన్నటిదాకా బుగ్గన సొంత జిల్లాకే చెందిన భూమా నాగిరెడ్డి (వైసీపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే) కొనసాగిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్కిచ్చిన భూమా పీఏసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి నేరుగా విజయవాడ వెళ్లి టీడీపీలో చేరిపోయారు. అసెంబ్లీలో విపక్షానికే దక్కే ఈ పదవికి భూమా ప్లేస్ లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో పీఏసీ సమావేశం కాగా, కమిటీ చైర్మన్ గా బుగ్గన పదవీ బాధ్యతలు చేపట్టారు.