: రూ. 10 కోట్ల బీమా సొమ్ము కోసం... రూ. 14 కోట్ల దోపిడీ ప్లాన్... దొరికిపోయిన యజమానులు!


పట్టపగలు దర్జాగా ఆభరణాల దుకాణానికి వచ్చి, రూ. 14 కోట్ల విలువైన నగలు దోపిడీ చేసిన కేసును చండీగఢ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దుకాణం యజమానులే అసలు నిందితులని తేల్చారు. షోరూములోని నగలకు రూ. 10 కోట్ల బీమా చేయించిన సోదరద్వయం వినోద్, రజనీష్ వర్మలు ఆ డబ్బు కోసం దోపిడీకి ప్లాన్ వేశారని, సీసీటీవీ సాక్ష్యాలను నాశనం చేశారని, మెమొరీ కార్డును దాచేశారని తెలిపారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, దోపిడీకి తమ బంధువులనే రంగంలోకి దింపిన వీరు, శనివారం నాడు ఉంగరం ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చి రెక్కీ జరిపినట్టు, ఆపై ఆదివారం వచ్చి తుపాకులతో బెదిరించి, ఉద్యోగులను, సెక్యూరిటీని గదిలో బంధించి రూ. 14 కోట్ల విలువైన నగలను దోపిడీ చేసినట్టు కట్టుకథ అల్లారు. దోపిడీ గురించి ఫిర్యాదు చేసిన వెంటనే, తమను ప్రశ్నిస్తారన్న భయంతో విచారణను తప్పించుకునేందుకు ఇద్దరూ ఆసుపత్రుల్లో చేరారు. వీరి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం రావడంతో అసలు సంగతి బయటకు వచ్చింది. వీరిపై మోసం, ఫోర్జరీ, సాక్ష్యాల నాశనం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News