: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నవంబర్ 9న ముహూర్తం!


ఉత్తరప్రదేశ్ లోని వివాదాస్పద రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి నవంబర్ 9న ముహూర్తం నిర్ణయించినట్టు సాధువులు, పూజారుల సంఘం ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభ మేళ సందర్భంగా సమావేశమైన హిందూ మత పెద్దలు రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ఖరారు చేశారు. కాగా, గతవారంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సైతం అయోధ్యలో రామాలయ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయోధ్యపై కోర్టుల్లో ఉన్న కేసుల పరిష్కారానికి చీఫ్ జస్టిస్ సైతం కృషి చేస్తున్నారని స్వామి అన్నారు.

  • Loading...

More Telugu News