: బ్రెజిల్ జాతి ఎద్దుపై స్పీకర్ కోడెల సవారీ!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ హోదాలో తనదైన శైలిలో దూసుకెళుతున్న గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్... అభివృద్ధిలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. తన సొంత నియోజకవర్గాన్ని బహిరంగ మలవిసర్జన లేని అసెంబ్లీగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్న కోడెల... ఆ దిశగా ఇప్పటికే విజయం సాధించేశారు. తాజాగా బ్రెజిల్ పర్యటనకు వెళ్లిన ఆయన... రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. బ్రెజిల్ లోని ప్రవాసాంధ్రులతో కలిసి చర్చోపచర్చలు జరిపిన కోడెల... పాడి పరిశ్రమలో ఏపీ పురోగతి సాధించేందుకు సహకారం అందించాలని అక్కడి తెలుగువారిని కోరారు. పర్యటన ముగించుకుని తిరుగు పయనమయ్యే ముందు నిన్న అక్కడి ప్రవాసాంధ్రులతో భేటీ అయిన సందర్భంగా కోడెల... బ్రెజిల్ జాతి ఎద్దుపై ఎక్కారు. ఈ అరుదైన దృశ్యానికి చెందిన ఫొటోను ఓ తెలుగు దినపత్రిక నేటి తన సంచికలో ప్రత్యేకంగా ప్రచురించింది.