: రాయలసీమ రక్తం, పౌరుషం చంద్రబాబులో ఉంటే కనుక పార్టీ ఫిరాయింపు నేతలతో రాజీనామా చేయించాలి!: వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి
రాయలసీమలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో ఇక్కడి రక్తం, పౌరుషం ఉంటే కనుక పార్టీ ఫిరాయించిన నేతలతో రాజీనామా చేయించి, వారిని మళ్లీ పోటీ చేయించాలని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ప్రజల పక్షం అంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోతారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రజలను బాబు మోసగిస్తున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో కేంద్రంతోనూ, తెలంగాణతోనూ బాబు లాలూచీ పడ్డారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.