: కేటీఆర్ ఓ బచ్చా.. పాలేరు ఉపఎన్నికకు కేసీఆర్ బాధ్యత వహిస్తే సమాధానం చెబుతాను: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేటీఆర్ ఓ బచ్చా అని.. అతని సవాల్ కు తాను స్పందించాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాలేరు ఉప ఎన్నికకు సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తే కనుక తాను సమాధానం చెబుతానని అన్నారు. అడ్డదారుల్లో పాలేరు ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావు తన పదవులకు రాజీనామా చేసి పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.