: ఆఫ్ఘనిస్తాన్ లో రోడ్డు ప్రమాదం...73 మంది మృతి


ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్-కాందహార్ ప్రధాన రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ గజనీలోని మోకార్ జిల్లాలో ఒక ఆయిల్ ట్యాంకర్ పేలిన సంఘటనలో రెండు బస్సుల్లోని సుమారు 73 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. సహాయకచర్యల్లో పాల్గొనడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News